
కేవలం తటస్థ వేదికపై అటు ఆసియా కప్ నిర్వహిస్తేనే తాను టోర్నీలో కొనసాగుతాము అంటూ తెలిపింది. ఆసియా కప్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లను కూడా పాకిస్థాన్లో నిర్వహించి ఇక భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు ప్రపంచ క్రికెట్లో బలమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ తమ పంథా నెగ్గించుకుంది అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు ఇమ్రాన్ ఖాన్. బీసీసీఐ ఏకంగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. భారత్ లాగా మరే దేశానికి సంపద సృష్టించే సామర్థ్యం లేకపోవడమే ఇందుకు కారణం అంటూ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ ఏ టీం తో ఎక్కడ ఆడాలి.. ఏ టీం తో ఆడకూడదు అన్న విషయాన్ని నిర్ణయిస్తూ బీసీసీఐ నియంతలాగే వ్యవహరిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు నిరూపించే ఐపిఎల్ లో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.