ఇక మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా శుభమన్ గిల్ మంచి ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో తన కెరియర్ లోనే అత్యుత్తమమైన ర్యాంకును సొంతం చేసుకున్నాడు శుభమన్ గిల్. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ని విడుదల చేయగా.. యువ సంచలనం గిల్ ఏకంగా నాలుగో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక అదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఇక ఎప్పటిలాగానే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.
ఐసీసీ విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కూడా భారత బౌలర్లు సత్తా చాటారు అని చెప్పాలి. భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ మళ్ళీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు అని చెప్పాలి. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ప్రస్తుతం శుభమన్ గిల్ అటు గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పటిలాగానే మంచి ప్రదర్శనలు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి