హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ఎప్పటికప్పుడు తన బౌలింగ్ ప్రదర్శన మెరుగు పరుచుకుంటూ అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే . అటు అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ లో సైతం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక బౌలర్గా కొనసాగుతూ ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైన వికెట్లు పడగొడుతున్నాడు అని చెప్పాలి. సిరాజ్ అంచలంచలుగా ఎదుగుతున్న తీరు చూసి అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. ఇకపోతే సిరాజ్ ఇటీవల ఆర్సిబికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.



 ఒకప్పుడు క్రిస్టియానో రోనాల్డో లాగా మహమ్మద్ సిరాజ్ సుయ్ సెలబ్రేషన్స్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు అలాంటి సెలబ్రేషన్స్ తగ్గించాడు. ఈ సెలబ్రేషన్స్ విషయంలో అటు ట్రైనర్లు గట్టిగానే సిరాజుకి వార్నింగ్ ఇచ్చారట. రోనాల్డో లాగా సూయి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో నా కాళ్ళ ఎముకలు మెలి తిరిగి... జాయింట్లు దెబ్బతినే  ప్రమాదం ఉంది. అందుకే అలా సెలబ్రేట్ చేసుకోవద్దని ట్రైనర్లు చెప్పారు. ఇక తన కెరీర్ మొదట్లో బ్యాట్స్మెన్ గా ఉండేవాడినని.  కానీ ఆ తర్వాత బౌలింగ్ వేయాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.



 మొదట ఇన్ స్వింగ్  అవుట్ స్వింగ్ అంటే నాకు తెలియదు. కానీ ఎంతో వేగంగా బౌలింగ్ వేయాలని మాత్రమే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తనకు రంజీల్లో ఆడే అవకాశం దక్కిందని తాను ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఒక వికెట్ పడగొట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ భారత జట్టు తరఫున ఆడే అవకాశం వస్తుంది అని మాత్రం ఎన్నడూ ఊహించలేదు అంటూ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆర్సిబి జట్టులో వాతావరణం కొత్తగా ఉందని.. ఈ సీజన్లో తాము ట్రోఫీ నెగ్గే అవకాశం ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl