
అయితే ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అటు ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లు కలిసి రావట్లేదు. దానికి తోడు అటు బెంగళూరు మాత్రం మొండి పట్టుతో కొన్ని బ్యాడ్ సెంటిమెంట్లను కొనసాగిస్తూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక అలాంటి బ్యాడ్ సెంటిమెంట్లలో గ్రీన్ జెర్సీ సెంటిమెంట్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో గో గ్రీన్ నినాదంతో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది బెంగళూరు జట్టు. అయితే ఈ జెర్సీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా బెంగళూరు జట్టుకి ఓటమి ఖాయం అని అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జెర్సీతో ఆడిన చాలా సందర్భాల్లో బెంగళూరుకి ఓటమి తప్పలేదు.
దీంతో బెంగళూరు జట్టుకు గ్రీన్ జెర్సీ అనేది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇది బ్యాడ్ సెంటిమెంట్ అని తెలిసినప్పటికీ.. బెంగుళూరు జట్టు యాజమాన్యం మాత్రం మొండిపట్టుతో ప్రతి సీజన్లో గ్రీన్ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. అయితే ఇక ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం బ్యాడ్ సెంటిమెంట్ ను జయించింది బెంగళూరు టీం. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ముందు అటు బ్యాడ్ సెంటిమెంట్ కూడా భయపడిపోయింది అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.