
ఇక జట్టు కెప్టెన్ గా ఉన్న ఆటగాళ్లు సరైన సమయంలో ఇలా రివ్యూ సిస్టం ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక డెసిషన్ రివ్యూ సిస్టం ని అటు ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ధోనీ రివ్యూ సిస్టం అని అంటూ ఉంటారు. ఎందుకంటే ధోని ఒక్కసారి రివ్యూ తీసుకున్నాడు అంటే చాలు ఇక బ్యాట్స్మెన్ గా ఉన్న వ్యక్తి వికెట్ గురించి ఆశలు వదులుకోవాల్సిందే. ధోని ఎన్నిసార్లు రివ్యూ తీసుకున్న అతనికి అనుకూలంగానే ఫలితం వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే ధోని ఎప్పుడు రివ్యూ కు వెళ్లిన అతని లెక్క తప్పదు అని అభిమానులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కానీ ఇటీవల ipl లో భాగంగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో తొలిసారి రివ్యూ విషయంలో ధోని లెక్క తప్పింది.
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ధోని యశస్వి జైష్వాల్ విషయంలో రివ్యూ తీసుకుని బోల్తా కొట్టాడు అని చెప్పాలి. తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని జైస్వాల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయి అతని ప్యాడ్లను తాకింది. దీంతో కీపర్ ధోని చేతుల్లోకి వెళ్ళింది బంతి. అయితే ఎంపైర్ కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన లేకపోవడంతో ధోని ఎలాంటి ఆలస్యం లేకుండా రివ్యూ కు వెళ్లాడు. ధోని అంత కాన్ఫిడెంట్గా రివ్యూ తీసుకున్నాడు అంటే ఇక యశస్వి జైస్వాల్ అవుట్ అయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అల్ట్రా ఎడ్జ్ లో బంతిని చెక్ చేస్తే కేవలం ప్యాడ్లను మాత్రమే తాకినట్లు తేలింది. దీంతో సీఎస్కే ఒక రివ్యూ కోల్పోయింది.