
అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈసారి ఐపీఎల్ టైటిల్ విజేత ఎవరు అనే విషయంపై కూడా ఎంతోమంది మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక ఇలా మాజీ ప్లేయర్స్ ఇస్తున్న రివ్యూలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఐపీఎల్ ఫైనల్ పై మరింత అంచనాలను కూడా పెంచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మాట్లాడిన భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వరకు 15 ఏళ్ళ ఐపీఎల్ హిస్టరీలో 15 టైటిల్స్ లో 12 కప్పులను కూడా భారత క్రికెటర్ల సారధ్యంలోనే గెలిచారని గుర్తు చేసుకున్నాడు సునీల్ గవాస్కర్.
ఇక ఆయా జట్లకు మెంటర్ గా భారత సీనియర్ క్రికెటర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక రింకు సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రింకు సింగ్ అద్భుతమైన ప్రదర్శన వెనుక కోల్కతా కోచ్ చంద్రకాంత్ పాత్ర ఎంతో ఉంది అంటూ సునీల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో కూడా భారత ఆటగాడు కెప్టెన్సీ లో ఉన్న టీమే టైటిల్ గెలవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. కాగా ఇప్పటికే చెన్నై జట్టు ఫైనల్ లో అడుగుపెట్టగా మొదటి క్వాలిఫైయర్ లో ఓడిపోయిన గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.