
దీంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా అటు అభిమానులు అందరూ కూడా భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఇక ఆడింది రెండు మూడు బంతులు అయినా సరే ఇక అభిమానులు అది చూసి మురిసిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అప్పటి వరకు ఒక రకంగా ఉన్న వ్యూయర్షిప్ ధోని ఎంట్రీ సమయంలో మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఈ ఐపీఎల్ సీజన్లో ధోని బ్యాటింగ్‌ను 2.5 కోట్ల మంది వీక్షించారు. ఇక ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక వ్యూయర్షిప్ రికార్డుగా కొనసాగింది అయితే ఇక ఇప్పుడు ధోని రికార్డును యంగ్ ఓపెనర్ గిల్ సమం చేశాడు.
ఇటీవల క్వాలిఫైయర్ 2 లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో శుభమన్ గిల్ బ్యాటింగ్ లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 49 బంతుల్లో సెంచరీ.. మొత్తంగా 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే గుజరాత్ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అని చెప్పాలి. అయితే ఇక గిల్ బాటింగ్ చేస్తున్న సమయంలో 2.5 కోట్ల మందికి పైగా వీక్షించడంతో సరికొత్త రికార్డు నమోదయింది. ఏకంగా ధోని బ్యాటింగ్‌ను చూసినట్లుగానే గిల్ బ్యాటింగ్‌ను కూడా ఎక్కువ మంది చూడడానికి ఆసక్తి చూపారు. దీంతో ధోనితో సమానంగానే వ్యూయర్షిప్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇక ఐపీఎల్ లో మూడు సెంచరీలు చేసి ఓకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు.