
అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఎలా అయితే బిసిసిఐ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిందో.. ఇక ఇప్పుడు ముగింపు వేడుకలను కూడా ఇలాగే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలో ముగింపు వేడుకలలో సందడి చేయబోతున్నారు అని చెప్పాలి. అయితే నేడు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో రివ్యూ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
56 రోజుల పాటు ఎంతో ఉత్కంఠ భరితమైన క్రికెట్ను అందించిన ఐపీఎల్ లో.. జరిగిన ఆసక్తికర ఘటన గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో తలబడిన రెండు జట్లు ఇక ఇప్పుడు ఫైనల్ లో కూడా ఐపీఎల్ లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి అని చెప్పాలి. మార్చి 31వ తేదీన మోడీ స్టేడియంలో గుజరాత్, చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో అదే గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అదే అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరి అప్పుడు ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది నేడు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.