నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా.. లేకపోతే మనుషుల రూపంలో ముసుగు వేసుకున్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని సాటి మనిషికి ఏదైనా ప్రమాదం వస్తేనే.. అయ్యో పాపం అంటూ జాలిపడి సహాయం చేసేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఏకంగా స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు అన్న తేడా లేకుండా ఇక చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలుతీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని అయోమయంలో పడిపోతున్నాడు ప్రతి మనిషి. ఈ క్రమంలోనే ఇక అనుక్షణం ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అనే భయంతోనే బ్రతికేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న హత్యలకు సంబంధించిన ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంత చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసేస్తారా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈకోవలోకి చెందినది అని చెప్పాలి. చికెన్ వండలేదు అన్న కారణంతో ఒక స్నేహితుడు మరో స్నేహితుని దారుణంగా చంపేశాడు.


 ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా.. కానీ ఇక్కడ నిజంగానే జరిగింది. ధీరజ్ (27), సుశీల్ గోస్వామి (27)   సుజిత్ (26), బాల నిమిష్ (26 ) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఘట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో ఉన్న జోడిమెట్లలో ఉంటున్నారు. సిమెంట్ ఇటుకల యూనిట్లో పని చేస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. కాగా  ఇటీవలే ఆదివారం సెలవు కావడంతో ఇక స్నేహితులందరూ కలిసి రాత్రి సమయంలో మద్యం తాగారు. ఇక ఆ తర్వాత సుశీల్ గోస్వామి చికెన్ వండాలి అంటూ ధీరజ్ కు చెప్పాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ధీరజ్ సుశీల్ చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రాత్రి నిద్ర పోయిన తర్వాత ధీరజ్ తలపై సుశీల్ ఇటుకలు వేసి దారుణంగా చంపేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: