
ఇకపోతే పటిష్టమైన జట్టుతో బలిలోకి దిగి ఇక సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలని ఆశపడుతున్నాయి రెండు జట్లు. కాగా నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఇరు జట్లను కూడా గాయాలు బెడద వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రాక్టీస్ లో ముందుకు తేలిన సమయంలో ఇటీవల ఇషాన్ కిషన్‌కు గాయమైంది. దీంతో అతను జట్టులోకి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానం నెలకొనగా.. గాయం చిన్నదే అని తెలియడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభంనికి ముందు అటు టీమిండియాకు మరో షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ వేలికి గాయం అయిందట. దీంతో ఇక ఫైనల్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అని ఆందోళన అందరిలో మొదలైంది. అయితే రోహిత్ శర్మ చేతికి అయినా గాయం చిన్నదే అని తెలుస్తుంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎడమ చేతి బొటనవేలుకు బంతి నేరుగా వచ్చి తగిలింది. దీంతో కొంచెం రక్తం కూడా కారింది. ఇక రోహిత్ తన బొటన వేలుకు టేపును చుట్టుకున్న ఒకటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే గాయం తర్వాత రోహిత్ శర్మ ప్రాక్టీస్ నుంచి తప్పుకొని రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తుంది.