
అందుకే చాలామంది బౌలర్లు అటు టీ20 ఫార్మర్ లో ఎక్కువ వికెట్లు తీయడం విషయంలో పెద్దగా రికార్డులు కొల్లగొట్టరు. కానీ కొంతమంది బౌలర్లు మాత్రం ఎంతో తెలివిగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ లను బోల్తా కొట్టిస్తూ.. ఇక వికెట్ దక్కించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వికెట్ తీయడం విషయంలో కూడా తమకు ఎవరు సాటిరారు అన్న విషయాన్ని నిరూపిస్తూ అరుదైన రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ సైతం ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్లో ఇలాంటి ఒక అరదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.
సునీల్ నరైన్ తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు బ్యాట్స్మెన్లను తికమక పెట్టి తప్పులు చేసేలా టెమిట్ చేస్తాడు. చివరికి వికెట్ దక్కించుకుంటాడు. ఇక బ్యాటింగ్ లో కూడా మెరుపుల మెరిపిస్తాడు. అయితే టి20 ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డు సృష్టించాడు సునీల్ నరైన్. టి20 బ్లాస్ట్ టోర్నీలో సర్రే టీం తరఫున ఆడుతున్నాడు. గ్లామర్గాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఒక వికెట్ పడగొట్టి.. ఈ రికార్డు సృష్టించాడు. అతనికంటే ముందు బ్రావో 615, రషీద్ ఖాన్ 555 వికెట్లు తీసి ఈ రికార్డు సాధించిన బౌలర్లుగా ఉన్నారు.