అయితే ఇటీవల కాలంలో టీమిండియాలో ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఇచ్చి హవా నడిపిస్తున్న నేపద్యంలో.. సీనియర్స్ కు టీంలో చోటు లేకుండా పోతుంది. కానీ ఇలాంటి సమయంలో కూడా యంగ్ ప్లేయర్స్ నుంచి పోటీని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా మలుచుకుంటూ.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు అశ్విన్. ఇకపోతే ఇటీవల వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం కూడా జట్టులో ఎంపిక అయ్యాడు. తుది జట్టులో కూడా అడుగు పెట్టాడు. అంతేకాదు తాను జట్టుకు ఎంత కీలకమైన ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు అశ్విన్. ఈ క్రమంలోనే తన ప్రదర్శన పై ఇటీవల స్పందిస్తూ సంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ గడ్డపై మరోసారి అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. మ్యాచ్ జరిగే కొద్ది పిచ్ స్పిన్కు అనుకూలంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో పిచ్ ను వీలైనంత వేగంగా అర్థం చేసుకొని అందుకు తగ్గట్లుగానే భౌలింగ్ చేయాలి. అప్పుడే మనం అనుకున్నట్లుగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది అంటూ రవిచంద్రన్ ఆశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారీ ఆదిక్యం సాధించిన టీమిండియా ఇక మూడో రోజు ఆటను కొనసాగించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి