అటు ప్రపంచ దేశాల్లో క్రికెట్కు ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది యువకులు క్రికెట్ ను ప్యాషన్ గా మార్చుకొని ఇటువైపుగా అడుగులు వేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే అన్ని దేశాల్లో కూడా ఐపీఎల్ తరహాలో టి20 లీగ్ లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ టి20 లీగ్లలో ఎన్నో ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయ్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.


 ఎప్పుడూ క్రికెట్ ని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే క్రికెట్ ప్రేక్షకులు ఇలాంటి ఘటన గురించి గతంలో ఎప్పుడు విని చూసి ఉండరు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగింది అంటారా.. సాధారణంగా రెండు జట్ల మధ్య ఒక సిరీస్ జరిగిన సమయంలో.. ఇక సిరీస్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే సిరీస్ మొత్తం మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డు వరిస్తూ ఉంటుంది. అయితే అవార్డు దక్కించుకున్న వారికి కొన్ని కొన్ని సార్లు కాస్లీ కార్లు బహుమతిగా ఇస్తే ఇంకొన్నిసార్లు నగదు బహుమతిగా ఇస్తూ ఉంటారు.


 ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కూడా ఇంతవరకే తెలుసు. కానీ ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కోసం ఊహించని బహుమతిని ఇచ్చారు. కెనడా జిటి20 సిరీస్లో మాంట్రియల్ టైగర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన  రూథర్ ఫర్డ్ కు నిర్వాహకులు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అర భూమిని బహుమతిగా ఇచ్చారు. అది కూడా అమెరికాలో. టోర్నీలో అతను 220 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో సర్రే జాగ్వార్స్ పై మాంట్రియల్ టైగర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ అందుకుంది. అయితే ఇలా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా అర ఎకరా భూమిని అందించడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: