వన్ డే ప్రపంచా కప్ దగ్గరకొస్తోంది. ఈ సారి భారత్ వేదికగా  జరగనున్న ప్రపంచ కప్ పోటీలకు అన్ని దేశాలు ఇప్పటికే టీం లను సిద్ధం చేసాయి. 2019 లో త్రుటిలో కప్ చేజార్చుకున్న న్యూజీలాండ్ తో పాటు ఒక్క సారి కూడా కప్ గెలవని సౌత్ ఆఫ్రికా కూడా ఈ సారి కప్ గెలవటానికి ఉవ్విళ్ళూగుతున్నారు. ఐతే టోర్నమెంట్ దగ్గర పడే కొద్దీ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తమ తమ ఫేవరెట్ ప్లేయర్ ని , టీంని వెళ్ళబుచ్చడం సహజం. తాజాగా వెస్ట్ ఇండీస్ క్రికెటింగ్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ పై తన ఊహలను పంచుకున్నారు.

వివియన్ రిచర్డ్స్ అంచనా ప్రకారం రాబోయే ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసేది పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది. రిచర్డ్స్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ఆఫ్రిది తో కలిసి కొంత సమయం గడిపానని తెలిపారు. షహీన్ షా ఆఫ్రిది ఖచ్చితంగా ఈ టోర్నీలో విజృంభిస్తాడని అన్నారు రిచర్డ్స్. షహీన్ షా ఆఫ్రిది ఇప్పటివరకు 52 అంతర్జాతీయ టి 20 మ్యాచ్లు ఆడి 64  వికెట్లు, 27 టెస్ట్ మ్యాచ్లు ఆడి 105 వికెట్లు, 39 వన్ డే మ్యాచ్లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. ఈమధ్య ఆఫ్గనిస్తాన్ తో జరిగిన వన్ డే సిరీస్ లో 6 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ టేకర్ గా నిలిచాడు.  

ఇక బాటింగ్ విషయానికొస్తే ఈ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ కు చెందిన స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని అంచనా వేశారు సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ జాక్ కలీస్. బట్లర్ అస్సలు ప్రెషర్ తీసుకోకుండా ఆడుతాడని, ఇండియన్ పిచ్ ల పైన అతనికి అవగాహన ఉందని అన్నారు కలీస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc