మరికొన్ని రోజుల్లో భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ మొదలవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్నాయ్. అత్యుత్తమ టీం తో బరిలోకి దిగేందుకు ఇప్పటికే అన్ని ప్రాణాలికలను కూడా రెడీ చేసుకున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంటే ఇంకోన్ని టీమ్స్ మాత్రం వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కూడా వరుసగా సిరీస్ లు ఆడుతూ ఉండటం గమనార్హం. అయితే మొన్నటికి మొన్న ఆసియా కప్ ను విజయవంతంగా ముగించుకుంది టీమిండియా.


 ఆసియా కప్ లాంటి మెగా టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ తో పటిష్టమైన ఆస్ట్రేలియా తో భారత్ వేదికగా వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమయింది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇండియా వేదికగా జరుగుతున్న ఈ వన్డే సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకంగా కానుంది. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే భారత్ ఆస్ట్రేలియా పై విజయం సాధించింది అంటే ఇక వరల్డ్ కప్ గెలవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోతారు.


 జట్టు ఆటగాళ్లలో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు అటు భారత్తో వన్డే సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు  ఒక భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా జట్టులో కీ ప్లేయర్ లుగా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్, మాక్స్వెల్ మొదటి వన్డే మ్యాచ్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు. గజ్జల్లో నొప్పితో స్టార్క్ చీలమండ గాయంతో మ్యాక్స్వెల్ బాధపడుతున్నట్లు తెలిపాడు. అయితే మిగతా రెండు వన్డే మ్యాచ్ లకి మాత్రం వారు అందుబాటులో ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: