అయితే ఇక తన పేస్ బౌలింగ్కు ఎంతో మంది బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టి దిగజ బౌలర్గా ఎదిగిన వారిలో సౌత్ ఆఫ్రికా బౌలర్ డెయిల్ స్టేయిన్ కూడా ఒకరు అని చెప్పాలి అయితే ఇటీవల డెయిల్ స్టేయిన్ తన కెరియర్లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాట్స్మెన్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే సాధారణంగా సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీ పేరును చెబుతూ ఉంటారు. కానీ డెయిల్ స్టేయిన్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ పేరును చెప్పాడు. అయితే మొన్నటికి మొన్న తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డైల్ స్టెయిన్ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించగా ఇప్పుడు డెయిల్ స్టేయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం నాకు ఎప్పుడు కష్టతరంగానే అనిపిస్తుంది. అతను అద్భుతమైన బ్యాటర్ మాత్రమే కాకుండా జట్టును నడిపించే సమర్థవంతమైన నాయకుడు. అంతర్జాతీయ స్థాయిలో నాకు అసలు సిసలైన సవాల్ విసిరిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మాత్రమే అంటూ డెయిల్ స్టేయిన్ చెప్పుకొచ్చాడు. ఇలా ఇద్దరు దిగ్గజాలు పరస్పరం ఒకరి ఆటను ఒకరు గౌరవించుకోవడంకు సంబంధించిన కామెంట్లను మాత్రం ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా డెయిల్ స్టేయిన్ సౌత్ ఆఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 45 t20 లు ఆడాడు. ఆయా ఫార్మర్లలో 439, 196,64 వికెట్లు పడగొట్టాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి