
అలాంటిది వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే ఇక ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా వరల్డ్ కప్ కి ముందు నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేస్తుంది. అయితే టీమిండియా ఆటగాళ్లు మాత్రం ఈ అవకాశాన్ని పొందలేకపోయారు అని చెప్పాలి. ఇకపోతే 1975 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగడం మొదలైంది. అప్పటినుంచి వరల్డ్ కప్ కి ముందు ఐసీసీ ప్రకటిస్తున్న ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఆ వివరాలు చూసుకుంటే.. 1975లో మొదటి వన్డే వరల్డ్ కప్ జరగడానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ఇయాన్ చాపల్, 1979లో గ్రేగ్ చాపెల్, 1983లో వివియన్ రిచర్డ్స్, 1987లో వివియన్ రిచర్డ్స్, 1992లో డీన్ జోన్స్,1996లో బ్రియాన్ లారా,1999లో మైఖేల్ వాన్, 2003లో మాథ్యూ హెడెన్, 2007లో మైక్ హాసి, 2011లో అసీం ఆమ్లా, 2017లో ఏబి డివిలియర్స్, 2019లో విరాట్ కోహ్లీ.. ఇక ఎప్పుడు 2023లో బాబర్ అజాం వరల్డ్ కప్ టోర్నికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.