
ఇలాంటి రివ్యూలు కాస్త అటు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లు కూడా తమ ప్రత్యర్థి టీమ్స్ లో ఏ ఆటగాళ్ళు డేంజరస్ అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ ఆల్ రౌండర్, ఆ జట్టు వైస్ కెప్టెన్ అయినా షాదాబ్ ఖాన్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడాడు భారత జట్టులో తన ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈ పాకిస్తాన్ ఆల్ రౌండర్. టీమ్ ఇండియాలో తన ఫేవరెట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అంటూ చెప్పాడు.
రోహిత్ శర్మ క్రీజులో సెట్ అయ్యాడు అంటే అతని ఆపడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు అతను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అంటూ తెలిపాడు షాదబ్ ఖాన్. బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. అతడు చాలా డేంజరస్. ఒక్కసారి సెట్ అయ్యాడు అంటే అతనికి బౌలింగ్ చేయడం కూడా కష్టం తెలిపాడు. అయితే ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ మ్యాచ్లో షాదాబ్ ఖాన్ బౌలింగ్లో రోహిత్ శర్మ వీర కొట్టుడు కొట్టాడు అనే విషయం తెలిసిందే అయితే టీమిండియాలో తన ఫేవరెట్ బౌలర్ ఎవరో కూడా చెప్పేశాడు. భారత జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనకు ఫేవరెట్ బౌలర్ అంటూ తెలిపాడు.