సాధారణంగా ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిన సమయంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆయా జట్టు ప్లేయర్లు ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ ఇక మ్యాచ్ గెలవడం విషయంలో మరికొన్ని కూడా కీలక ప్రభావం చూపుతూ ఉంటాయి. అందులో టాస్ గెలవడం ఒకటి.  ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ మ్యాచ్ పరిస్థితిలకు తగ్గట్లుగా బౌలింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా అనే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక మ్యాచ్ విజయంలో అటు స్టేడియంలో ఉన్న పిచ్ కూడా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని స్టేడియాలలో ఇక పిచ్ విషయంలో కొన్ని సెంటిమెంట్లు కూడా కొనసాగుతూ ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తప్పక విజయం సాధించడం.. లేదంటే చేజింగ్ చేసిన జట్టు విక్టరీ సొంతం చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా ఇలాంటి ఒక సెంటిమెంట్ ఉంది అని చెప్పాలి. వన్డే ఫార్మాట్లో ఈ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా మొదట బ్యాటింగ్ చేసిన చెట్టు గెలుస్తుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది అని చెప్పాలి. 2013 నుంచి ఈ స్టేడియంలో 9 వన్డే మ్యాచ్లు జరగగా.. ఏడు మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయ్.


 గతంలో భారత్ సౌత్ ఆఫ్రికా ఆఫ్గనిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రమే ఇది సాధ్యం కాలేదు. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన నెదర్లాండ్స్ కేవలం 90 పరుగులకే పరిమితమైంది. దీంతో 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్ హిస్టరీలోనే  భారీ విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc