వరల్డ్ కప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి జట్టుకు మొదట్లోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుండి నడిపిస్తున్న సారథి కేన్ విలియమ్సన్ గాయం బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్లు పాటు అతను అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతను జట్టులో లేకపోవడంతో టామ్ లాథం సారధ్య బాధ్యతలను భుజానా వేసుకున్నాడు. అయితే గాయం బారిన పడినప్పటికీ ఇక్కడ డ్రింక్స్ బాయ్ రూపంలో జట్టుకు దగ్గరగానే ఉన్న కేన్ విలియంసన్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.
ఇలా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో బోటనవేలు ఫ్రాక్చర్ కు గురైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇప్పుడు కోరుకున్నాడు అన్నది తెలుస్తుంది. రెండు వారాల విరామం అనంతరం ఇటీవల నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే నవంబర్ ఒకటవ తేదీన సౌత్ ఆఫ్రికా తో జరగబోయే మ్యాచ్లో విలియమ్సన్ మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయంపై అటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుతం పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది కివీస్ జట్టు. ఇకపోతే విలియమ్సన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రచిన్ రవీంద్ర అదిరిపోయే బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి