టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఇక వరల్డ్ క్రికెట్లో 78 సెంచరీలు సాధించి ఎవరికి అందనంత దూరంలో ఉన్న ఈ క్రికెట్ కింగ్ ని ఇష్టపడని వారంటూ ఉండరు అని చెప్పాలి. ఇక ఛేజింగ్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అని అభిమానులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సాధించిన గణాంకాల గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే.  అయితే ఇలా విరాట్ కోహ్లీని  అభిమానించే వారిలో నేను కూడా ఉన్నాను అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.


 కర్ణాటక కు చెందిన సునీల్ శెట్టి బాలీవుడ్లో నటుడుగా స్థిరపడ్డాడు. ఇక స్టార్ యాక్టర్ గా ఒకానొక సమయంలో హవా నడిపించాడు. ఇక ఇప్పుడు ఎంతోమంది సార్ హీరోల సినిమాలో కీలక పాత్రలు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే తన అల్లుడు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ను కాదని విరాట్ కోహ్లీనే తన ఫేవరెట్ అంటూ చెప్పాడు. కాగా కేల్ రాహుల్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మనీ కంట్రోల్ సమ్మిట్ లో పాల్గొన్న సునీల్ శెట్టి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


తన అభిమాన క్రికెటర్ ఎవరు అని అడగగానే.. విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు సునీల్ శెట్టి. అదే సమయంలో తన అల్లుడు కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే కచ్చితంగా విరాట్ కోహ్లీ పేరు చెబుతాను. కేఎల్ రాహుల్ నా కుమారుడు. నా కుటుంబ సభ్యులు గురించి నేను పొగిడితే బాగుండదు కదా. నిజానికి నేను జాతీయ జట్టుకు ఆడాలనుకున్నాను. నా అల్లుడు రూపంలో ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది అంటూ సునీల్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఏదేమైనా చేజింగ్ మాస్టర్ కాబట్టే కోహ్లీ నా అభిమాన క్రికెటర్ అయ్యాడు అంటూ సునీల్ శెట్టి సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: