దీంతో ఇక పాకిస్తాన్ జట్టుకు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అని అనుకుంటున్నా సమయంలో ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం విజయం సాధించి కాస్త ఉపశమనం పొందింది. ఇక ఈ విజయంతో అటు సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ విజయం తర్వాత పాకిస్తాన్ మళ్లీ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఇక ఆ జట్టు అభిమానులు అందరూ కూడా హడావిడి చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇండియా, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన టీమ్స్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ బచ్చా టీం లాగా పిలుచుకొనే బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.
అయినప్పటికీ పాకిస్తాన్ అభిమానులు చేస్తున్న అతి మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇదంతా నచ్చని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమిజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఫీల్డ్ కామెంట్రీ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తాన్ కి కప్పు వస్తుంది అంటే నాకు నవ్వు వస్తుంది.. నవ్వొచ్చా అని పాకిస్తాన్ దేశాన్ని పరిమిషన్ అడిగాడు రమిజ్ రజా. ఇది చూసి చాలామంది పాకిస్తాన్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ పుంజుకుంటుంటే మన దేశం తరఫున క్రికెట్ ఆడి ఇప్పుడు మన వాళ్ళనే వెక్కిరించడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. అయితే రమిజ్ రాజా చెప్పిన దాంట్లో తప్పేముంది అని ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి