ఇందులో సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. మొదటి భాగం హిందీలో మాత్రం విడుదల చేయగా రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే రెండవ భాగాన్ని మాత్రం తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా విషయంపై ప్రముఖ హీరోయిన్, డైరెక్టర్ భార్య యామీ గౌతమ్ తన మొదటి రివ్యూ ని తెలియజేసింది.
భారత్ సమ్మిట్ 2026 లో భాగంగా పాల్గొన్న యామీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన భర్త చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారని వృత్తిని ఎంతో ప్రేమిస్తున్నారని తెలియజేసింది. తాను ఇటీవలే దురంధర్ 2 సినిమా చూశానని వెల్లడించింది ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి భారతీయుడు కూడా గర్వపడేలా ఈ సినిమా ఉంటుందంటూ తెలియజేసింది యామీ గౌతమ్. దీంతో ఇమే చెప్పిన ఈ వ్యాఖ్యలు సినిమా పైన అంచనాలను మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తున్నాయి. అలాగే మార్చి 19వ తేదీన యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అటు రన్ టైంలో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమాకి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి