వరల్డ్ కప్ లో భాగంగా ఒక ఉత్కంఠ భరితమైన సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని టీమ్ గా కొనసాగుతున్న జట్టు ఒకవైపు ఉంటే.. భారీ స్కోర్లు నమోదు చేస్తూ ప్రత్యర్థులను భయపెడుతూ వరుస విషయాలు సాధిస్తున్న జట్టు మరోవైపు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతూ ఉండడంతో.. ప్రేక్షకులు అంచనాలు కూడా రెట్టింపు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై అటు విశ్లేషకులకు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే రెండు కూడా పటిష్టమైన టీమ్స్ గానే కొనసాగుతున్నాయ్. ఇక ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని చెల్లాయిస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రెండు టీమ్స్ కూడా ఎంతో పట్టిష్టంగానే ఉన్నాయి. దీంతో ఎవరు విజేతగా  నిలుస్తారు అన్న విషయంపై మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అది సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం కష్టమే. సౌత్ ఆఫ్రికా మాత్రం సొంతగడ్డ పైన అయినా ఇంత బాగా రాణిస్తుందో లేదో కానీ భారత మైదానాలలో మాత్రం ఇరగదీస్తుంది.


 దీంతో రెండు టీమ్స్ పై కూడా ఒకే రీతిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఇదే విషయం గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో హోరాహోరీ పోరు ఖాయం అంటూ అభిప్రాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్స్ లో ఉండే పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. భవిష్యత్తులో గొప్ప ఆల్ రౌండర్ కాగల సామర్థ్యం మార్కో జాన్సన్ కు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అతను భారత జట్టుకి డేంజర్ గా మారతాడని.. ఇక బౌలింగ్లో కోహ్లీ రోహిత్ లను ఇబ్బంది పెట్టగలడు అంటూ అభిప్రాయపడ్డాడు.  ఎంగిడి లాంటి బౌలర్లతో పాటు అత్యుత్తమ ఫీల్డింగ్  కూడా వారి సొంతం. ఇక లక్నో జట్టులోని సహచరుడైన డి కాక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: