ఇండియా వేదికగా వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత భారత్ హెడ్ కోచ్ పదవి గురించి ఒక ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారత జట్టును కోచ్గా ఎంతో విజయపతంలో ముందుకు నడిపించిన రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ రాబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే వరల్డ్ కప్ టోర్నీ ముగియటంతోనే  అటు రాహుల్ ద్రావిడ్ కోచ్ కాంట్రాక్ట్ పదవి కాలం కూడా ముగిసింది అన్న విషయం తెలిసిందే.


 అయితే మరోసారి భారత జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్  కొనసాగాలి అని అటు అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అతను కోచ్గా అంతలా సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. కానీ రాహుల్ ద్రావిడ్ అటు మరోసారి హెడ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టేందుకు.. సుముఖంగా లేడు అన్నది తెలుస్తుంది. దీంతో ఇక భారత జట్టుకు హెడ్ కోచ్గా కొత్త వ్యక్తి రాబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే భారత జట్టు కొత్త కోచ్ గా ఎవరు వస్తే బాగుంటుంది అనే విషయంపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు.



 ఈ క్రమంలోనే భారత కోచ్ గా వీళ్ళు అయితే బాగుంటుంది అంటూ ముగ్గురు మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రస్తుతం తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ తో పాటు టీమిండియా మాజీ డేర్ అండ్ డాష్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇక మాజీ కోచ్ అనిల్ కుంబ్లేలు ఉన్నారట. అయితే ఇప్పటికే టీమిండియా అటు వివిఎస్ లక్ష్మణ్ ను  తాత్కాలిక కోచ్గా నియమించింది. ఇక గతంలో కుంబ్లే ఒక ఏడాది పాటు టీమ్ ఇండియాకు కోచ్ గా కూడా చేశాడు. ఇక సెహ్వాగ్ కోచ్గా వస్తే టీమిండియాలో మరింత దూకుడు పెరుగుతుంది. మరి ఎవరు కోచ్ గా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: