టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్థిక్ పాండ్య. ఏకంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా   జట్టును విజయతీరాలకు నడిపించే కీలక ప్లేయర్గా ఉన్నాడు అని చెప్పాలి. అలాంటి హార్దిక్ పాండ్యా  అటు ఐపిఎల్ లో కూడా అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు  ఎన్నో ఏళ్లపాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అతను స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. అయితే 2021 ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ అతన్ని వదులుకుంది. దీంతో గుజరాత్ తమ చెంతన చేర్చుకుంది. అంతేకాదు కెప్టెన్సీ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది.


 అయితే ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా మొదటి ప్రయత్నంలోనే కెప్టెన్ గా గుజరాత్ జట్టును ఛాంపియన్గా నిలపాడు. ఇక రెండో ప్రయత్నంలో ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. అయితే ఇక అతని కెప్టెన్సీ చూసి అందరూ  ఫిదా అయ్యారు. టీమిండియా కెప్టెన్సీ రేస్ లో లో కూడా అందరిని వెనక్కి నేటి ముందుకు వచ్చాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు గుజరాత్ కెప్టెన్ గా తిరుగులేని ప్లేయర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన కెరియర్ ఎదుగుదలకు తోడ్పడిన గుజరాత్ ను వదిలేసి మళ్లీ పాత టీం అయినా ముంబైలోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు.


 దీంతో హార్దిక్ పాండ్యాకు గుజరాత్ యాజమాన్యానికి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇకపోతే ముంబై ఇండియన్స్ కు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి వెళ్లడం గురించి గుజరాత్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్థిక్ పాండ్య తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతనికి శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. కెప్టెన్గా హార్దిక్ రెండు సీజన్లో జట్టును ఫైనల్ కు తీసుకువచ్చి ఒక టైటిల్ అందించారు. ఇక ఇప్పుడు ముంబైకి వెళ్లాలనుకుంటున్నారు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అతనికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్న అంటూ ఒక పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl