2011లో ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇక అప్పటినుంచి భారత జట్టు అటు ఎన్నో వరల్డ్ కప్ లు ఆడింది. కానీ కప్పు మాత్రం గెలవలేకపోయింది  ఇలా టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందనీ ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. ప్రతి వరల్డ్ కప్ ఎడిషన్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోయే టీమిండియా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం నిరాశ పరుస్తూ వస్తుంది. కొన్నిసార్లు సెమీఫైనల్ ఇంకొన్నిసార్లు ఫైనల్ వరకు వెళ్లి ఇక కప్పును చేజార్చుకుంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల సొంత గడ్డపై 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగగా ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే అద్భుతంగా రానిస్తుందని అదరగొడుతుందని అందరు ఊహించారు  ఊహించినట్లుగానే వరుస విజయాలతో దూసుకుపోయింది టీమిండియా. సెమి ఫైనల్ వరకు పది మ్యాచ్లు ఆడితే అన్నింటి విజయం సాధించింది. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మరోసారి అభిమానులందరికీ కూడా నిరాశ మిగిల్చింది. అయితే ఇలా ఫైనల్లో టీం ఇండియా ఓడిపోయి రోజులు గడుస్తున్న ఇంకా ఈ ఓటమి బాధ నుంచి మాత్రం భారత క్రికెట్ ప్రేక్షకులు మాజీలు బయటపడలేకపోతున్నారు.


 ఇదే విషయంపై ఇటీవలే రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ఓడటం  ఇంకా బాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. కప్పు గెలవడం అంత తేలిక కాదని.. కీలకమైన రోజు గొప్పగా ఆడాలని చెప్పాడు. భారత్ అతి త్వరలోనే వరల్డ్ కప్ నెగ్గడం చూస్తాము అంటూ తెలిపాడు. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం కాస్త సమయం పడుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. టాలెంటెడ్ ప్లేయర్లకు భారత్ కేంద్రంగా మారిందని.. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో కీలక పోటీదారుగా టీమిండియా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: