
సీనియర్లందరికీ కూడా విశ్రాంతి ప్రకటించగా.. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమిండియా బరిలోకి దిగింది. అయితే ఆస్ట్రేలియాలోని సీనియర్ ప్లేయర్లను ఎదుర్కొని టీమిండియా తలబడి నిలబడటం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఏకంగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది భారత జట్టు. ఈ క్రమంలోనే సిరీస్ ను 4-1 తేడాతోకైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన ఐదో టి20 మ్యాచ్ అయితే ప్రేక్షకులందరికీ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎంటర్టైన్మెంట్ పంచింది.
చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు చివరికి ఆరు పరుగులు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 160 పరుగులు చేసింది. దీంతో 161 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేయడంలో విజయం సాధించారు. దీంతో 154/ 8 స్కోర్ కు ఆస్ట్రేలియా పరిమితమైంది. అయితే గెలుపుకు చివరి ఓవర్లో కంగారులు 10 పరుగులు చేయాల్సి ఉండగా.. మూడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు హర్షదీప్. దీంతో టీమ్ ఇండియాకు విజయం వరించింది. చివరి మ్యాచ్ లో గెలిచి లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని టీమిండియా ప్లేయర్స్ డైలాగ్ చెప్పుకునే పరిస్థితి వచ్చింది.