అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా అద్భుతం ప్రతిభ కనబరచాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మూడు ఫార్మట్లలో కూడా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుని ఒకవైపు ఫిట్నెస్ నూ మరోవైపు ఫామ్ కాపాడుకుంటూ కెరియర్ హ్యాపీగా సాగించాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం సమస్యలతో తరచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతుంటే ఇంకొంతమంది ఆటగాళ్లు మాత్రం ఫామ్ కొనసాగిస్తూ రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అని చెబుతూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో ఉన్న ఏ రికార్డు కూడా అతనికి దాసోహం అవ్వకుండా ఉండలేకపోయింది. అతని ఆటతీరుకు అన్ని రికార్డులు కూడా అతని ఖాతాలో చేరిపోతూ ఉంటాయి. అలా కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ ఇటీవల కాలంలో ఎంతో ముందు యువ క్రికెటర్లు ఇలా కోహ్లీ సాధించిన రికార్డులను బ్రేక్ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్.


 ఈ క్రమంలోనే ఇటీవల కోహ్లీ సాధించిన ఒక రికార్డు సమం అయింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ వన్డేల్లో ఏకంగా కోహ్లీ రికార్డును సమం చేశాడు. అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో క్రికెటర్ గా నిలిచాడు. 114 మ్యాచ్లలోనే హోప్ 5000 పరుగుల మైలు రాయిని అందుకోవడం గమనార్హం. అయితే గతంలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా 114 ఇన్నింగ్స్ లోనే ఘనత సాధించాడు. ఇక గతంలో వివ్ రిచర్డ్ సైతం ఇలా 114 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించగా ఇక ఈ లిస్టులో టాప్ లో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాబర్ అజం 97 మ్యాచ్లలోనే  5 వేల పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: