వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఒక విషయంపై భారత క్రికెట్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అదే హెడ్ కోచ్ పదవి గురించి. భారత జట్టుకు ప్రస్తుతం హెడ్ కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు రాహుల్ ద్రావిడ్. ఇక అతని కోచింగ్ లో టీమిండియా ఎంత అద్వితీయమైన విజయాలను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఎంతోమంది ఆటగాళ్లు తమ ప్రతిభను మరింత మెరుగుపరచుకొని జట్టులో కీలక ఆటగాళ్లుగా మారిపోయారు అని చెప్పాలి.



 ఇలా ఏకంగా జట్టును తన నేతృత్వంలో ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ ద్రవిడ్. అయితే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత  రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో అతన్ని మళ్ళి కోచ్ గా కొనసాగిస్తారా లేదా అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఇక మళ్ళీ రాహుల్ ద్రావిడ్ ని హెడ్ కోచ్గా ఉండబోతున్నాడు అని తెలిసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల జై షా హెడ్ కోచ్ పదవి పై కీలక వ్యాఖ్యలు చేశాడు  దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పై నిర్ణయం తీసుకుంటాము అంటూ చెప్పుకొచ్చాడు.


 దీంతో ఇక రాహుల్ ద్రావిడ్ ను మళ్లీ మునుపటిలా పూర్తిస్థాయి హెడ్ కోచ్ గా నియమించలేదని.. ఇక మరో ప్రధాన కోచ్ ను నియమించుకునేంతవరకు కూడా అటు భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించాలి అని బీసీసీఐ సూచించింది అంటూ మరో వార్త తెరమీదికి వచ్చింది  వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ వరకు అటు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉంటారు అనుకున్నప్పటికీ.. ఇంకా దక్షిణాఫ్రికా టూర్ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి కోసం అంగీకరించకపోతే కొత్తకోచ్ వచ్చే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు జై షా కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: