ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని సంతోషం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దాదాపు రెండు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. అందులో భాగంగా రోజూ మ్యాచులు ఉంటాయి. ఆ మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరును కొట్టినట్లు అయితే దానిని ఆపోజిట్ టీం బీట్ చేసే క్రికెట్ అభిమానుల ఆనందం మరింతగా పెరుగుతూ ఉంటుంది.

ఇకపోతే ఆదివారం వచ్చింది అంటే వారికి మరింత ఆనందం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆదివారం రోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరుగుతాయి. అందులో భాగంగా ఈ రోజు కూడా రెండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఆ మ్యాచ్ లు ఎవరి మధ్య..? ఏ స్టేడియంలో జరగబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ రోజు ఆదివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా మరియు లక్నో మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఇప్పటికే ఈ జట్టు అభిమానులంతా కూడా వీరి మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు వాంఖడే స్టేడియంలో ముంబై మరియు చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక జట్టులో ధోని ఉండడం ... మరొక జట్టులో రోహిత్ ఉండడంతో ఈ మ్యాచ్ చూడడానికి జనాలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పాయింట్లు పట్టికలో చూసినట్లు అయితే కోల్కతా రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా... చెన్నై ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతుంది. లక్నో నాలుగవ స్థానంలో ఉండగా ... ముంబై ఏడవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl