ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఈ ఏడాది కూడా ఐపీఎల్ సీజన్ సక్సెస్ అవుతుంది. అయితే అటు కొన్ని టీమ్స్ విషయంలో మాత్రం అభిమానులు అంచనాలు కారుమారు అవుతున్నాయ్ అని చెప్పాలి. అద్భుతంగా రానించి టైటిల్ విజేతగా నిలుస్తాయి అనుకున్న టీమ్స్  టైటిల్ పోరులో వెనుకబడిపోతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమ్స్ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాయ్.


 ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నగా సాగిపోతు ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. ఇక ఎంతోమంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అటు రాజస్థాన్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ద్ కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో మొదటి ఓవర్ లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. సాధారణంగా మొదటి ఓవర్లో వికెట్ తీయడం అంత సులభమైన విషయం కాదు  ఎందుకంటే బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి కాదు కేవలం క్రీజులో నిలదొక్కుకోవడానికి మాత్రమేసమయాన్ని కేటాయిస్తారు. దీంతో ప్రతి బంతిని ఆచితూచి ఆడుతూ ఉంటారు.


 ఇలాంటి సమయంలో వికెట్లు పడగొట్టడం అనేది మామూలు విషయం కాదు. బౌల్ట్  మాత్రం ఐపీఎల్లో మొదటి ఓవర్ లోనే ఏకంగా 26 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లో ఐదవ బంతికి రోహిత్ శర్మను అవుట్ చేసి ట్రెంట్ బౌల్ట్ ఈ ఫీట్ సాధించాడు. దీంతో గతంలో భువనేశ్వర్ కుమార్ 25 వికెట్ల పేరిట ఉన్న రికార్డు ఇక ఇప్పుడు బద్దలైంది. బౌల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మను గౌడ్ ఇప్పటివరకు ఆరుసార్లు ఔట్ చేయడం గమనార్హం. కాగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl