ప్రస్తుతం యుఎస్, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఏ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అని ఊహించడం కూడా చాలా కష్టంగానే మారిపోయింది. ఎందుకంటే అంచనాలు పెట్టుకున్నట్లుగా అగ్రశ్రేణి టీమ్స్ రాణించడం లేదు. అటు చిన్న టీమ్స్ మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ అదరగొడుతూ ఉన్నాయి. ఏకంగా ఛాంపియన్ టీమ్స్ ని సైతం ఓడిస్తూ నయా చాంపియన్గా అవతరించినందుకు తెగ కసితో ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతోంది.


 ఇంకోవైపు అమెరికాలో ఉన్న పిచ్ లు అన్నీ కూడా నెమ్మదిగా ఉండడంతో ఇక అన్ని దేశాల జట్లు కూడా ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి. దీంతో ధనాధన్ బ్యాటింగ్ ఉండే పొట్టి ఫార్మాట్లో సైతం ఆటగాళ్లు ఎంతో నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకుంటున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా లో స్కోరింగ్ నమోదు అవుతూ ఉంది అని చెప్పాలో. ఈ లో స్కోరింగ్ గేమ్ లు చివరి బంతి వరకు సాగుతూ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరినీ కూడా ముని వేళ్లపై నిలబడేలా చేస్తూ ఉన్నాయి.  అయితే కొన్ని కొన్ని మ్యాచ్లు మాత్రం ఎంతో సింపుల్ గా జరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఒమన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్.. అయితే కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయిందేమో అనేట్లుగా ముగిసిపోయింది . ఎందుకంటే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానించిన ఇంగ్లాండ్ జట్టు ఒమాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్, ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి ఎక్కడ నిలవలేకపోయింది. దీంతో 48 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యింది. అయితే అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టు 3.1 ఓవర్లలోనే అంటే కేవలం 19 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. దీంతో కళ్ళు మూసి తెరిచేలోగానే మ్యాచ్ అయిపోయింది అంటూ ప్రేక్షకులు ఈ మ్యాచ్ గురించి కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc