పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎప్పుడు అభిమానులు అంచనాలను తారుమారు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తప్పకుండా గెలిచి తీరుతుంది అనుకుంటున్న మ్యాచ్లో చివరికి ఓడిపోయి అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. అదే సమయంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలవడం అసాధ్యం అని అనుకునే సమయాల్లో మాత్రం అటు తప్పకుండా విజయం సాధించి తిరుగులేని టీం అన్న విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తుంది.


 అందుకే పాకిస్తాన్ జట్టుపై ఒక అంచనాకు రాలేకపోతు ఉంటారు విశ్లేషకులు సైతం. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వరల్డ్ కప్లలో బాగా రాణించడంలో విఫలమవుతూనే ఉంది   భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ చివరికి నిరాశ పరుస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోనీలు దశతోనే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ ఇక ఇప్పుడు వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 లో కూడా ఇలాగే నిరాశపరిచింది. కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి.


 అయితే పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి  కాగా పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన చేసినప్పటికీ అటు ఆ జట్టు కెప్టెన్ బాబర్ మాత్రం రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా బాబా నిలిచాడు. 17 ఇన్నింగ్స్ లో బాబర్ 549 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో ధోని 529, విలియంసన్ 527, జయవర్తనే  360 పరుగులతో తర్వాత స్థానంలో ఉన్నారు. అయితే గతంలో  వన్డే వరల్డ్ కప్ లో జట్టు విఫలమైన సమయంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్..  ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా టీం ఇదే చేయడంతో.. మళ్ళీ కెప్టెన్సీ నుంచి తప్పుకోపోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: