అయితే ఇండియాలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు పాకిస్తాన్, ఉగ్రవాదులు సైనికులు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సరిహద్దుల వద్ద ఏదో ఒక విధంగా చొరబాటుకు ప్రయత్నించి.. ఇక ఇండియాలో ఏకంగా ఉగ్ర దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయితే పాకిస్తాన్ వ్యవహార శైలి కారణంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు గందరగోల వాతావరణం ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఇక్కడ భారత సైన్యం ఎప్పుడూ కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తూ ఉంటారు. పాకిస్తాన్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇండియా, పాకిస్తాన్ బార్డర్ లో ఎప్పుడు గొడవలు జరిగిన అవి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.
అయితే ఇలా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఏకంగా ఇరుదేశాల సైనికులు ఎన్నోసార్లు యుద్ధం చేసిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఇలాంటి యుద్ధము జరిగింది. కానీ సైనికుల మధ్య కాదు రెండు జింకల మధ్య. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో రెండు జింకలు ఓ రేంజ్ లో యుద్ధం చేసుకున్నాయ్. బోర్డర్ కు అవతల ఉన్న ఒక జింక ఇవతల ఉన్న మరో జింక కొమ్ములతో కుమ్మేసుకున్నాయి. ఎక్కడ రెండు జింకలు పోరాడే విషయంలో తగ్గలేదు. ఒకదానికి ఒకటి బలంగా కుమ్ముకున్నాయి. ఈ సమయంలోనే ఒక బిఎస్ఎఫ్ ఆఫీసర్ సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయ్. ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. పాకిస్తాన్ ను చూస్తే ఇండియాలోని జింకకు కూడా కోపం వస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.