అయితే ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలి అనే ఆలోచన మంచిదే.. అయినప్పటికీ దీనికోసం ఎంతోమంది జనాలు చేస్తున్న పిచ్చి పనులు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఏకంగా ప్రాణాలను ప్రమాదంలో పెట్టే విన్యాసాల సైతం చేయడానికి వెనకడుగు వేయడం లేదు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి విన్యాసాలు చేసి చివరికి ప్రాణాలకు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఒక యువకుడు ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే ఒక ప్రమాదకరమైన విన్యాసం చేయాలి అనుకున్నాడు కానీ చివరికి ఆ విన్యాసం బెడిసి కొట్టింది. అత్యుత్సాహంతో విన్యాసం చేయాలనుకున్న యువకుడు.. చివరికి ప్రమాదం బారిన పడ్డాడు. నది ఒడ్డున ఇసుకలో స్టెంట్ చేయడానికి వెళ్ళాడు. తన స్నేహితులు కెమెరా ఆన్ చేయగానే దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇసుకలో పల్టీలు కొట్టి మళ్ళీ స్టాండీగా నిలబడాలి. అయితే దూరం నుంచి యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి గోతిలో ఒకసారిగా పల్టీలు కొట్టాడు. అయితే గాల్లో ఒక రౌండ్ పల్టీలు కొట్టి రెండో రౌండ్ కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నేలకు అతని తల గట్టిగా తాకింది. దీంతో నొప్పితో విలువిలాడిపోయాడు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కావడంతో ఒక్కసారిగా బొక్క బోర్లా పడుకున్నాడు. ఈ ఘటనతో అతని స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసి అటు ఇంటర్నెట్ జనాలు కూడా షాక్ లో మునిగిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి