కానీ ఈ మధ్యకాలంలో మాత్రం రిటైర్మెంట్ విషయంలో అటు స్టార్ క్రికెటర్లు ఆలోచిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు తమ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత.. ప్లేయర్లు ఎవరూ కూడా మళ్లీ క్రికెట్ ఆడాలని అనిపించిన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేవారు కాదు. ఈ మధ్యకాలంలో మాత్రం ఇలా వీడ్కోలు పలకడం మళ్ళీ రిటైర్మెంట్ ని తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇంగ్లాండు స్టార్ క్రికెటర్ మోయిన్ అలీ కూడా ఇప్పటివరకు రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ యూ టర్న్ తీసుకున్నాడు.
ఇక ఇప్పుడు మూడో సారి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లపాటు క్రికెట్ ఆడాను. యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించి యు టర్న్ తీసుకున్న మోయున్ అలీ ఈసారి మాత్రం అలా చేయబోను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన మోయిన్ అలీ.. ఆ జ
ట్టు తరపున 68 టెస్టులు 138 వన్డే మ్యాచ్ లు 92 t20 మ్యాచ్ లు ఆడాడు.