ఇప్పటివరకు ఐపీఎల్ లో ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్సీబీ 2025 ఐపీఎల్ లో కప్పు గెలిచింది. అయితే ఆర్ సి బి కప్పు గెలవాలని దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు.అందరూ అభిమానుల కోరిక మేరకే ఆర్సిబి ఈసారి కప్పు కొట్టింది.కానీ ఆ కప్పు కొట్టిన ఆనందం 24 గంటలు కూడా గడవక ముందే ముగిసిపోయింది.ఎందుకంటే ఆర్సిబి కప్పు కొట్టడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఈ తొక్కిసలాటలో దాదాపు 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగేలా ఉంది.దీంతో దేశవ్యాప్తంగా చాలామంది ఆర్సిబి పై ఫైర్ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా కప్పు గెలవలేదని, కప్పు గెలవాలని ఎంతోమంది కోరుకున్నారు. కానీ కప్పు గెలిచాక ఇంత మందిని పొట్టన పెట్టుకుంటారా..

అంతేకాకుండా ఇంత తొక్కిసలాట జరిగి ఇంత మంది చనిపోతే కనీసం స్పందించకుండా విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై ఆర్సిబి ప్లేయర్లు ఒక్కరు కూడా స్పందించలేదు. కొంతమంది ఏమో వీరికి ఇంకా తెలియలేదు అని అంటున్నారు. ఇక అభిమానులు లెక్కకుమించి రావడంతో పోలీసులు లాఠి ఛార్జ్ చేశారు. దాంతో ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట  జరిగి దాదాపు 11 మంది చనిపోయారు. అయితే ఆర్సీబీ కప్పు గెలిచాక తక్కువ సమయమే ఉండడం..సరైన ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని అంటున్నారు.

 అయితే rcb కప్పు గెలిచాక సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఈ తొక్కిసలాట జరగడంతో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇంత మందిని పొట్టన పెట్టుకోవడానికే ఆర్ సి బి కప్పు గెలిచిందా.. గెలవక గెలవక గెలిస్తే గెలిచిందని ఆనందపడేలోపే ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకొని వీరాభిమానుల తల్లిదండ్రులకి కన్నీరుని మిగిల్చింది అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది ఏమో ఇన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ కప్పులు వివిధ టీమ్స్ గెలిచాయి. కానీ ఇలా ఎప్పుడూ కూడా అతి చేయలేదు. ఆర్సీబీ టీం చేసిన అతి కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని తిట్టిపోస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: