- ( స్పోర్ట్స్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు కాస్త విషాదంగా మార‌డం బాధాకరం. ఎట్ట‌కేల‌కు 18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఆర్సీబీ ఫ‌స్ట్ టైం ఐపీఎల్ విన్న‌ర్ అయ్యింది. ఐపీఎల్ 2025 ను ఆర్సీబీ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఆనందం ఆ జ‌ట్టుకు ఎంతో సేపు లేకుండా చేసింది. చిన్న స్వామి స్టేడియంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆర్సీబీ అభిమానులు ప‌ది మంది వ‌ర‌కు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. పైగా 50 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మొత్తం 10 మంది మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


అయితే ఈ ఘ‌న‌ట‌కు ఎవ‌రిది త‌ప్పు అని చూస్తే పోలీసుల పూర్తి వైఫ‌ల్య‌మే అంటున్నారు. ఆర్సీబీ గెలుపును యావత్ దేశం ఎంజాయ్ చేసింది. అభిమాన ఆట‌గాళ్లు బెంగ‌ళూరు న‌డి బొడ్డున ఉన్న చిన్న‌స్వామి స్టేడియం కు వ‌స్తున్నారంటే అక్క‌డ కు భారీ సంఖ్య‌లో అభిమానులు రాకుండా ఉంటారా ? త‌ప్ప‌కుండా భారీ స్థాయిలో వ‌స్తారు ? అందుకు త‌గిన‌ట్టుగా స్టేడియం వ‌ద్ద ఏర్పాట్లు చేయ‌లేద‌ట‌. ఈ తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని కర్ణాటక బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక తొక్కిస‌లాట వ‌ల్ల చాలా మంది అభిమానులు సొమ్ము సిల్లి ప‌డిపోయారు.


చాలా మంది స్ప‌హ త‌ప్పి ప‌డిపోతే వారిని బ‌తికించేందుకు ప‌క్క‌న ఉన్న వారు .. పోలీసులు సీపీఆర్ చేశారు. అయినా అక్కడికక్కడే కొంతమంది మృతి చెందారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయ‌డంతో మ‌రింత ప్రాణ న‌ష్టం త‌ప్పింది. వెంట‌నే సీఎం సిద్ధ‌రామ‌య్య ఆసుప‌త్రికి చేరుకుని వారిని ప‌రామ‌ర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ క్షమాపణలు చెప్పారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb