అయితే ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఓడినా దక్షిణాఫ్రికా జట్టు ఓ వరల్డ్ రికార్డు తన పేరిట లఖించుకుంది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి న తర్వాత 300 పై పరుగులు సాధించిన తొలి జట్టుగా సౌతాఫ్రికా రికార్డులు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. పాకిస్తాన్ 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ లక్ష్య ఛేదనలో కేవలం 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు సౌతాఫ్రికా ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ 135 పరుగుల సెంచరీతో చెలరేగిపోవడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలు బాదడంతో 349 పరుగులు భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు ఆదిలో తడబడిన సౌతాఫ్రికా కేవలం 11 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72) , జన్సెన్ (70) , కార్బిన్ బాష్ (67) ఆదుకోవడం తో 49.2 ఓవర్లలో ప్రొటీస్ జట్టు 332 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా భారత్ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు పలు రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి