స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు. అయితే, మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకుగాను వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. గతంలో వ్యక్తిగత డేటాకు భద్రత లేదని ఆరోపణలతో కొంత మంది యూజర్స్ వాట్సాప్ నుంచి వెళ్లిపోగా, అలాంటిదేమీ ఉండబోదని వాట్సాప్ వివరణ ఇచ్చింది. ఇకపోతే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేందుకుగాను వాట్సాప్ ఫెసిలిటీ కల్పించింది. యూపీఐ పేమెంట్ యాప్స్ జాబితాలో వాట్సాప్ చేరిపోయింది. తాజాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్ చేసే క్రమంలో న్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే.. పేమెంట్స్ చేసేప్పుడు అందుకు తగ్గిన భావాన్ని కూడా ఇమేజ్ లేదా ఇతర రూపంలో చెప్పేయడం. 

ఇప్పటికే గూగుల్ పే యాప్‌లో పేమెంట్‌తో పాటు బ్యాక్ గౌండ్‌లో అందుకు తగ్గ భావాన్ని తెలిపేలా థీమ్ లేదా ఇమేజ్ కూడా జతచేసే ఫీచర్ వచ్చింది. అలానే వాట్సాప్‌లోనూ పేమెంట్ చెల్లింపుతో పాటుగా థీమ్ కూడా సెండ్ అయ్యేలా అప్‌డేట్ తీసుకొచ్చింది ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’.ఈ థీమ్‌ను కేవలం ఇండియాలోని వాట్సాప్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో తీసుకురావడం విశేషం. ఇకపై వినియోగదాలరు మనీ సెండ్ చేసే టైంలో బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్‌ ద్వారా తమ ఎక్స్‌ప్రెషన్స్ కూడా వ్యక్తపరచొచ్చని వాట్సాప్ తెలిపింది. సందర్భాన్ని బట్టి ఈ బ్యాక్ గ్రౌండ్ థీమ్‌ను ఎంచుకొని యూజర్స్ తమ భావాన్ని తెలుపొచ్చిని వాట్సాప్ పేమెంట్స్‌ డైరెక్టర్‌ మనేశ్‌ మహాత్మే పేర్కొన్నారు.

ఫర్ ఎగ్జాంపుల్ ‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా చెల్లె లేదా అక్కకు అన్న లేదా తమ్ముడు మనీ సెండ్ చేసినట్లయితే, డబ్బులతో పాటు రాఖీతో కూడిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ థీమ్‌ను సెండ్ చేయొచ్చు. ఇకపోతే బర్త్ డే, మ్యారేజ్ యానివర్సరీ ఇతరాలకు కూడా విషెస్‌తో పాటు  బొకే ఇతర పూల థీమ్స్ కూడా పంపొచ్చు. అయితే, యూజర్స్ ఇలా చేయడం వల్ల ఇతరులు హ్యపీగా ఫీల్ అవుతారు. ఓన్లీ మనీ సెండ్ చేయడం ట్రాంజాక్షన్‌గానే మిగిలిపోతుంది. ఇలా మనీతో పాటు థీమ్ సెండ్ చేయడం ద్వారా అనుభూతులు, భావాలను కూడా పంచుకున్నట్లు అవుతుంది. ఇకపోతే ఫ్యూచర్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌ను మరింత అట్రాక్టివ్‌గా, ఈజీగా ఉండేలా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: