బుల్లితెర యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు. అంత‌లా క్రేజ్ సంపాధించుకున్నాడు ఈ బుల్లితెర స్టార్‌. ఈయన అంటే అమ్మాయిలు ఎంతగా పడి చస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ఇతడికి అమ్మాయిలు ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రదీప్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో మంచి బజ్ కూడా ఏర్ప‌డింది.

 

ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే పలు ఎంటర్టైనింగ్ షోలలో ఆలీ వ్యాఖ్యాతగా చేసే “ఆలీతో సరదాగా” షో కూడా ఒకటి. అయితే రాబోయే సోమవారం టెలికాస్ట్ అయ్యే ఈ షోకు యాంకర్ ప్రదీప్ వచ్చాడు. అక్కడ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. మ‌రియు ఎన్నో అనుభూతుల‌ను పంచుకున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే ప్రదీప్ కు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య జరిగిన చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ను తెలిపారు. అత్తారింటికి దారేది షూటింగ్ టైమ్‌లో పవన్ కు బాగా డాన్స్ కొరియోగ్రఫీ చేసిన శివ శంకర్ మాస్టర్ తో మాట్లాడినపుడు తనకి అంత బాగా డాన్స్ నేర్పించినందుకు మీకు గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నానని అంటూ పక్కనే ఉన్న ప్రదీప్ ను చూపించి ఈ అబ్బాయిని గురు దక్షిణగా మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అంటూ అనేసారని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అలా శివ శంక‌ర్ మాస్ట‌ర్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌దీను గురు దక్షిణగా ఇచ్చార‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: