బుల్లితెర మెగాస్టార్ అనగానే గుర్తొచ్చే నటుడి పేరు ప్రభాకర్. తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు ప్రభాకర్.. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, హోస్టుగా, బహుముఖ ప్రజ్ఞాశాలి గా గుర్తింపు పొందిన నటుడు. ఇక బుల్లితెర నుంచి వెండితెరకు తన ప్రస్థానాన్ని కొనసాగించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు.


వీరిది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా. ఇక విద్యాభ్యాసమంతా ఖమ్మం జిల్లాలోని కొనసాగింది..ఇక వీరు మొత్తం ఏడుగురు సంతానం.ఇక వీరి తండ్రి వడ్రంగి పని చేసుకుంటూ వీరందరిని పోషించేవారు. రోజురోజుకు కుటుంబం పోషణ బరువుగా మారడంతో, కుటుంబంలో ప్రతి ఒక్కరూ కార్పెంటర్ పని చేసే వాళ్ళు. అలా ప్రభాకర్ కూడా ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు కార్పెంటర్ పని చేసి, స్కూల్ కి  వెళ్లి, తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి 10 గంటల వరకు కార్పెంటర్ పని చేసేవాడు. చిన్నప్పుడే పోలీస్ అవ్వాలనుకున్న ప్రభాకర్ పదవ తరగతి చదివిన తరువాత హోంగార్డుగా పని చేశాడు.

అలా హోంగార్డుగా పని చేస్తూ డిగ్రీ వరకు పూర్తి చేశాడు. హైదరాబాద్ లో పీజీ పూర్తి చేసి, అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా గుర్తింపు పొందిన రంగరాజు చేతులమీదుగా ఈయన గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు.ఆ తర్వాత  బుల్లితెరపై అడుగులు వేశాడు. ఇక పదవ తరగతి చదువుతున్న మలయజను డిగ్రీలో ఉన్నప్పుడే ప్రభాకర్ ప్రేమించాడు. ఆమె బీటెక్  థర్డ్ ఇయర్ వచ్చేసరికి అమ్మాయి ఇంట్లో వీరి ప్రేమ వ్యవహారం తెలిసింది.అప్పటికే ప్రభాకర్ సినీ ఇండస్ట్రీలో ఉండడంతో మంజుల నాయుడు, సుమ, రాజీవ్ కనకాల సహాయంతో ఆర్య సమాజం లో వీరి పెళ్లి జరిగింది. వీరికి శ్రీ దివిజ, చంద్రహాసన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.. శ్రీదివిజ  కూడా బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ సినిమాలలో కూడా కొన్ని పాత్రలు పోషించి, తనదైన శైలిలో అందరినీ అలరిస్తూ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: