గతంలో బిగ్ బాస్ సీజన్ 3 లోకి అడుగు పెట్టిన దీప్తి సునయన, అలాగే తనీష్ ల మధ్య జరిగిన ప్రేమాయణం అందరికీ తెలిసిందే. వీరి గురించి పుకార్లు వర్షా కాలంలో పుట్టగొడుగుల్లా వచ్చాయి. కానీ హౌజ్ నుండి బయటకు వచ్చాక వీరిది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో దీప్తి సునైనా ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ ఉండడంతో ఇప్పుడు పరిస్థితిని ప్రేక్షకులు పోలుస్తున్నారు. హౌజ్ లో సిరి, షన్ను ల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యింది. వీరి, హగ్గులు, ముద్దులకు హద్దులు లేకుండా పోవడంతో బయట కామెంట్లు కూడా అదే రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి.

వీరు ఏకంగా జంట పాములు అంటూ వీరి రొమాన్స్ చూడలేకపోతున్నాం బాబోయ్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అటు షన్ను లవర్ దీప్తి సునైనా ఇటు సిరిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రీహాన్ ఇరువురు వీరి వ్యవహారం చూసి బాధపడ్డారు అని బ్రేక్ అప్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌజ్ లోకి వారి సన్నిహితులు వచ్చి తమ తమ వారిని ఎంకరేజ్ చేశారు. కాగా షన్ను కోసం మొదట దీప్తిని పంపాలని, అలాగే సిరి కోసం శ్రీ హాన్ ని హౌజ్ లోకి పంపేందుకు వీరిని బిగ్ బాస్ టీం అడగగా సిరి విషయం మనసులో పెట్టుకుని దీప్తి, షన్ను, సిరి ల క్లోజ్నెస్ తో హార్ట్ అయిన శ్రీహాన్ ఇరువురు కూడా మొదట వద్దనట్లు సమాచారం.

అందుకే వీరికి బదులుగా వారి ఇంటి సభ్యులు వచ్చారు. ఆ తరవాత మళ్లీ కన్విన్స్ చేయడంతో శ్రీహన్ మరియు దీప్తి లు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సిరి, షన్ను లతో మాట్లాడేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. మొత్తానికి హౌస్ లో వారిద్దరి మధ్యన నడుస్తున్న ఈ రిలేషన్ ను బయట ఉన్న వీరిద్దరూ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఎలాగూ ఒక స్క్రిప్టెడ్ షో కాబట్టి ఇలా జరిగి ఉండవచ్చని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: