
జబర్దస్త్ షో తర్వాత వరుసగా షోలు చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా బుల్లితెరపై హవా చూపిస్తూ దూసుకెళ్లింది. ఇక టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా రంగస్థలం, క్షణం, యాత్ర, కథనం, థాంక్యూ, బ్రదర్, ఖిలాడి, పుష్ప, సహా ఎన్నో సినిమాలతో పాటు స్పెషల్ సాంగులు కూడా చేసి ప్రేక్షకులను బాగా అలరించింది.
ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడిన ఈమె ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించి.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కి కోడలుగా మరొకసారి తన నటనలో మార్క్ చూపించిందని చెప్పాలి. ఇక ఇదే కాకుండా పుష్ప 2, హరిహర వీరమల్లు, వేదాంతం రాఘవయ్య, హరి, భోళాశంకర్ వంటి సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలో హాట్ ఫోటోలతో పిచ్చెక్కించే అనసూయ ఎప్పటికప్పుడు ట్రోలింగ్ అవుతుందనే చెప్పాలి. ఇక తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ పోస్ట్ లో 100 సంవత్సరాల వయసున్న వృద్ధులకు పోటీ నిర్వహించగా 102 సంవత్సరాలు ఉన్న పండు ముసలి వ్యక్తి ఈవెంట్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. నా దేశంలో, నా రాష్ట్రంలో వయసు పెరగడం అనేది ప్రతి ఒక్కరికి అవమానంగా మారింది.. అంటూ రాసుకుంది ఈ ముద్దుగుమ్మ.