సాధారణంగా సినిమాలలో హీరోల పారితోషకం వింటూ ఉంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన హీరోలు రేంజ్ ను బట్టి కాకుండా పాపులారిటీని బట్టి పారితోషకాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు రూ.200 కోట్ల పారితోషకాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక అదే రేంజ్ లో హీరోయిన్లు కూడా మొన్నటివరకు రూ.5, 6 కోట్ల వరకూ డిమాండ్ చేసి ఇప్పుడు ఒక్కొక్కరు రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెర ఆడియన్స్ ను నిర్విరామంగా అలరిస్తున్న బుల్లితెర హీరోయిన్స్ కూడా పారితోషకం విషయంలో తామేమీ తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే బుల్లితెరపై అధికంగా పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ లు  ఎవరో ఇప్పుడు చూద్దాం..

సుహాసిని:
చంటిగాడు చిత్రం ద్వారా బుల్లితెర హీరోయిన్స్ ను బాగా అలరించిన ఈమె ఆ తర్వాత అపరంజి సీరియల్  మంచి గుర్తింపు అందించింది. అంతేకాదు ఒకవైపు బుల్లితెర హీరోయిన్గా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఈమె ప్రతిరోజు 20,000 రూపాయలను పారితోషకంగా అందుకుంటుంది.

ఐశ్వర్య:
అగ్నిసాక్షి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈమె కూడా ఒక్క రోజుకి 20వేల రూపాయల పారితోషకం అందుకుంటుంది.

పల్లవి రామిశెట్టి:
బుల్లితెర అనుష్కగా గుర్తింపు సంపాదించుకున్న పల్లవి ఆడదే ఆధారం సీరియల్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ లో ఈమెకు రోజుకు 15000 రూపాయల రెమ్యునరేషన్ అందించేవారు.

నవ్య స్వామి:
నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది. ఇక ఈమె కూడా ఒక్క రోజుకు 20వేల రూపాయల పారితోషకం అందుకుంటుంది.

హరిత:
వైదేహి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన హరిత ఎన్నో సీరియల్స్ లో నటించి ముద్దమందారం, కుంకుమపువ్వు వంటి టాప్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇప్పుడు ఈమె ఒక్క రోజుకి రూ. 12,000 పారితోషకం అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: