ఇదిలా ఉండగా ఇటీవల సింగర్ సునీత మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈమె కాస్త వైరల్ అయింది అంతేకాదు ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు మరింత వైరల్ గా మారాయి. పిల్లలు పెళ్లీడుకొచ్చిన తర్వాత ఈమె పెళ్లి చేసుకోవడం ఏంటో అంటూ కొంతమంది కామెంట్లు చేస్తే.. బామ్మ అయ్యే వయసులో అమ్మ అవుతుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు .అయినా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది సింగర్ సునీత. ఇదిలా ఉండగా ఈ క్రమంలోనే తన మొదటి భర్త గురించి కూడా పలు వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీకి చెందిన కిరణ్ అనే వ్యక్తితో 17 సంవత్సరాల వయసులోనే ప్రేమలో పడిన సింగర్ సునీత కుటుంబాన్ని ఎదిరించి తన 19 సంవత్సరాల ప్రాయంలో అతడిని వివాహం చేసుకుంది.అయితే కొన్ని రోజుల తర్వాత కిరణ్ కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కుటుంబ పెద్దలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. అవి పెద్దగా మారడంతో కొడుకు, కూతురు జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని కిరణ్ నుంచి వేరుపడింది సునీత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి