హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్స్ ని తెలుగు డబ్బింగ్ లోకి చాలా సీరియల్స్ ని చేశారు. అలా యే రిష్త క్యా కెహలాతా హై సీరియల్ నీ ..పెళ్లంటే నూరేళ్ల పంట అనే టైటిల్ తో డబ్బింగ్ అయ్యింది.. అయితే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించిన నటి హీనా ఖాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యింది. ఇక తన ప్రియుడు రాఖి జైస్వాల్ ను తాజాగా రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుతుంది హీనా ఖాన్.

.
హీనా ఖాన్ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతూ ఉన్నది. అందుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నది. తన ఆరోగ్యం కుదుట పదాలని అభిమానులు కూడా పూజలు చేయిస్తున్నారు. హీనా ఖాన్ తన ప్రియుడు రాఖీ తో కలిసి వివాహం చేసుకున్నట్టుగా అంగీకరిస్తూ  అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలకు రెండు వేరువేరు ప్రపంచాలను కడపడం వల్ల మనం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాం అన్నట్లుగా ఫోటోలకు క్యాప్షన్ జోడించి ఫోటోలను  చేసింది.


మేము ఒకరినొకరు ప్రపంచంగా మారబోతున్న ఈరోజు నుంచి మేము ఒకరిగానే జీవిస్తున్నామంటూ తన ప్రియుడు రాఖీ పైన ఉన్న ప్రేమని తెలియజేసింది హీనా ఖాన్. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. వీరి వివాహం కూడా చాలా సింపుల్ గానే చేసుకున్నట్లు తెలుస్తోంది. హీనా ఖాన్ కూడా చీర కట్టులో అందమైన ఆభరణాలతో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రియుడు రాఖీ కూడా చాలా సింపుల్ గానే కనిపించారు.అయితే మొత్తానికి వివాహం చేసుకొని ఈ జంట సడన్ షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: