
సుడిగాలి సుదీర్ బుల్లితెర నుంచి వెండితెర మీదకు ఎంతో కష్టపడి ఎదిగినా కూడా పలు చిత్రాలలో హీరోగా నటించిన ఎందుకో కలిసి రాలేదు. తాను నటించిన చిత్రాలలో సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు సినిమా తప్ప మరే సినిమాలు కూడా సక్సెస్ అందుకోలేకపోయాయి. తాను నటించిన గోట్ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇంకా విడుదల కాలేదు. దీంతో హీరోగా నిలబెట్టుకోలేకపోవడంతో మళ్లీ బుల్లితెరపైనే యాంకర్ గా మారారు.
తాజాగా ఫ్యామిలీ స్టార్ షోకి వచ్చిన జర్నలిస్ట్ జాఫర్ ఆయనతో పాటు బుల్లితెర యాక్టర్స్ కూడా వచ్చారు. ముఖ్యంగా జాఫర్ ,సుడిగాలి సుదీర్ ని ప్రశ్నల వర్షంతో వనికి పోయేలా చేసినట్లు ఈ ప్రోమోలో కనిపిస్తోంది. సుడిగాలి సుదీర్ చీకటి కోణం అంటూ ప్రోమో వైరల్ గా మారుతోంది .ఇది చూసిన చాలామంది అభిమానులు షోలో ఇలాంటివి జరగడం ఏంటి అంటూ ఆశ్చర్యపైన మరికొంతమంది మాత్రం ఇదంతా కూడా టిఆర్పి రేటింగ్ కోసమేనేమో అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.. అయితే సుడిగాలి సుదీర్ ఒక అమ్మాయి తో ఎఫైర్ నడిపారని ప్రొఫెషనల్ గా కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఇది జరిగింది అంటూ జాఫర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి అసలు విషయం ఏంటన్నది త్వరలోనే చూడాలి.