బ్రహ్మముడి సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నైనిషా రాయ్ బాగా సుపరిచితమే.. ఈ సీరియల్ లో అప్పు పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. సీరియల్ మొదట్లో రౌడీ బేబీల కనిపించిన నైనిషా అందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకుంది. తాజాగా ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ తన ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు నైనిషాకి కంగ్రాజులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈనటికి కాబోయే వరుడు గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


నైనిషా తను ప్రేమించిన ప్రియుడిని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మేము సాధించామంటూ తన ఇంస్టాగ్రామ్ లో క్యాప్షన్ ఫోటోలను షేర్ చేసింది. నైనిషా బాయ్ ఫ్రెండ్ పేరు ఆశిష్ చక్రవర్తి.. ఇతను కూడా ఒక సీరియల్లో హీరోగా నటిస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి అనే సీరియల్ లో నటిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా నటుడు ఆశిష్ పలు సీరియల్స్లలో నటించారు. నటుడు కాకముందు ఆశిష్ బాడీ బిల్డర్ గా కూడా ఉన్నారట.


ముఖ్యంగా 2018 మిస్టర్ మద్రాస్, 2017లో మిస్టర్ ఇండియా చెన్నై, అలాగే మిస్టర్ ఇండియా బెస్ట్ స్కిన్, 2019లో మిస్టర్ చెన్న ఇంటర్నేషనల్ వంటి టైటిల్స్ ని కూడా గెలిచారు. జీ తెలుగులో ఎక్కువగా సీరియల్స్  చూసి ప్రేక్షకులకు ఆశిష్ బాగా తెలుసు. జీ తెలుగులో జరిగినటువంటి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా కూడా ఈ టీమ్ నిలిచింది.ఆ సమయంలో కూడా తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నారు. మొత్తానికి బ్రహ్మ ముడి సీరియల్ నైనిషా పప్పు అన్నం త్వరలోనే పెట్టబోతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జోడీకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటని పొగిడేస్తూ కామెంట్స్ తో వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: